SBI Travel Card | దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ.. తన ఖాతాదారులకు సరికొత్త కార్డును అందుబాటులోకి తెచ్చింది. మల్టీ కరెన్సీ ఫారిన్ ట్రావెల్కార్డు తీసుకొచ్చింది. మల్టీపుల్ కరెన్సీలతో కూడిన నగదును లోడ్ చేసే ప్రీపెయిడ్ కార్డు ఇది. దీన్ని ఏటీఎం కార్డు గానూ, విదేశాల్లో మర్చంట్ పాయింట్స్లోనూ వాడొచ్చు.కస్టమర్లు దీన్ని 20 లక్షలకు పైగా ఏటీఎంలు, ప్రపంచవ్యాప్తంగా 34.5 మిలియన్ల మర్చంట్స్, షాపులు, రెస్టారెంట్లు, హోటళ్ల వద్ద వాడొచ్చునని ఎస్బీఐ తెలిపింది.
చిప్, పిన్ ప్రొటెక్టెడ్ ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డు
అమెరికా డాలర్లు, బ్రిటిష్ పౌండ్లు, యూరో, సింగపూర్ డాలర్, ఆస్ట్రేలియా డాలర్, కెనడా డాలర్, యూఏఈ దిర్హాం తదితర ఏడు విభిన్న కరెన్సీల్లో ఈ కార్డును వాడొచ్చు.
బ్యాకప్ కోసం అడిషనల్ కార్డు లభ్యం
ఒకవేళ కార్డు కోల్పోయినా, దొంగిలించబడినా 24 గంటలు ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా రీప్లేస్మెంట్కు అసిస్టెన్స్. బ్యాంకు ఖాతా వివరాలేమీ అవసరం లేదు.
వాల్యూడ్ పాస్పోర్టు ఉన్నంత వరకు ఎక్స్పైరీ డేట్ రీలోడబుల్. ఫారెక్స్ కొనుగోళ్లపై ఫామ్ ఏ2, కింద డిక్లరేషన్ ఇవ్వాలి.
సమీప ఎస్బీఐ శాఖలో గానీ, బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో గానీ దరఖాస్తు చేయొచ్చు.
ఏటీఎం లొకేటర్ వంటి సర్వీసులు పొందొచ్చు. బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్స్ మీద భద్రతతో కూడిన ఆన్లైన్ పర్యవేక్షణ ఉంటుంది.
దీని వినియోగంపై చార్జీలు పారదర్శకంగా ఉంటాయి. కస్టమర్లు ఎక్స్చేంజ్ రేట్ల ప్లక్షువేషన్స్ నివారించొచ్చు.
కార్డు పోయినా, దొంగిలించబడినా కార్డులో బ్యాలెన్స్ మొత్తం ప్రకారం ఎమర్జెన్సీ క్యాష్ తీసుకోవచ్చు. సంబంధిత కరెన్సీలో క్యాష్ సరిపడా లేకపోతే, ఇతర కరెన్సీల నుంచి డిడక్ట్ అవుతుంది.
కనీసం 200 డాలర్లు.. ఏటీఎంల వద్ద గరిష్ఠంగా, మర్చంట్ పాయింట్ల వద్ద 10వేల డాలర్ల వరకు ఖర్చు చేయొచ్చు.