SBI | న్యూఢిల్లీ, మే 13: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 శాఖలతోపాటు 15 వేల మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు బ్యాంక్ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. వీరిలో అత్యధిక మంది మార్కెటింగ్ విభాగానికి చెందినవారని, అలాగే 11-12 వేల మంది ప్రోబేషనరీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగులను సైతం రిక్రూట్ చేసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆఫీసర్ స్థాయి ఉద్యోగులతోపాటు ఇంజినీర్లు కూడా ఉన్నారన్నారు. గతేడాది బ్యాంక్ 139 శాఖలను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 22,542 లకు చేరుకున్నాయి. మరోవైపు, బ్యాంక్‌నకు సంబంధించి సబ్సిడరీ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారి సేవలను కూడా బ్యాంక్ వినియోగించుకోబోతున్నది. ముఖ్యంగా ఆఫీస్ వర్క్, మార్కెటింగ్, రికవరీ కోసం వీరిని వాడుకోనున్నది.