ఎస్బీఐ లాభం 19,684 కోట్లు
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికపు ఏకీకృత నికర లాభంలో 6 శాతం వృద్ధి నమోదు చేసుకున్నది.
- క్యూ4లో 6 శాతం పెరిగిన ప్రాఫిట్
- రూ.17.35 డివిడెండ్ ప్రకటించిన బ్యాంక్
ముంబై, మే 8: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికపు ఏకీకృత నికర లాభంలో 6 శాతం వృద్ధి నమోదు చేసుకున్నది. జనవరి- మార్చి మధ్యకాలానికిగాను బ్యాంక్ రూ.19,684 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలానికి గాను బ్యాంక్ రూ.18,643 కోట్లుగా నమోదైంది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.1,43,876 కోట్ల నుంచి రూ.1,40,412 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది.
కుప్పకూలిన బ్యాంక్ షేరు
నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో ఎస్బీఐ బ్యాంక్ షేరు కుప్పకూలింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బ్యాంక్ షేరు 6.62 శాతం వరకు నష్టపోయి రూ.1,019.55 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈలోనూ 6.65 శాతం దిగొచ్చి రూ.1,019.30 వద్ద నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.66,691.20 కోట్లు కరిగిపోయి రూ.9,41,107.62 కోట్లకు జారుకున్నది.
- బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.49 శాతానికి దిగొచ్చాయి. అంతక్రితం ఏడాది ఇది 1.82 శాతంగా ఉన్నది.
- నికర ఎన్పీఏ కూడా 0.47 శాతం నుంచి 0.39 శాతానికి పడిపోయాయి.
- ఏకీకృత విషయానికి వస్తే రూ.1,81,079 కోట్ల ఆదాయంపై రూ.19,643 కోట్ల నికర లాభాన్ని గడించింది.
- రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ రూ.17.35 డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది.
- పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ రుణాల్లో వృద్ధి 13-15 శాతంగా నమోదైంది. అయితే ఈ యుద్ధం మరో ఆరు నెలల కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నది. వృద్ధి, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
– సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

