న్యూఢిల్లీ, మే 14 : దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ స్థాయిలో నిధులను సేకరించడానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 20న పబ్లిక్ ఆఫర్ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా 3 బిలియన్ డాలర్లు(రూ.25 వేల కోట్లు) నిధులను సమీకరించాలని యోచిస్తున్నది.
ఈ నిధుల సేకరణకు సంబంధించి బ్యాంక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. దీర్ఘకాలికంగా ఒకేసారి లేదా పలు దఫాలుగా 3 బిలియన్ డాలర్ల నిధులు సేకరించాలని నిర్ణయించింది. బ్యాంక్ షేరు ధర స్వల్పంగా తగ్గి రూ.800 వద్ద ముగిసింది.