SBI | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన నెట్వర్క్ విస్తరించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 400 శాఖలను ప్రారంభించనున్నది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 59 గ్రామీణ శాఖలతోపాటు మొత్తం 137 శాఖలను కొత్తగా ప్రారంభించింది.
‘89 శాతం డిజిటల్ లావాదేవీలు, 98 శాతం లావాదేవీలు శాఖ ఆవల జరుగుతున్నప్పుడు బ్యాంకు శాఖ అవసరం ఏమిటని కొందరు నన్ను అడుగుతున్నారు. దానికి నా జవాబు అవును ఆ అవసరం ఉందని. కొత్త ప్రాంతాలు పుట్టుకొస్తున్నప్పుడు కొత్త శాఖలు ప్రారంభించాల్సి ఉంటుంది’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖరా చెప్పారు. అడ్వైజరీ, వెల్త్ సర్వీసుల కోసం ఖాతాదారులు తప్పక బ్యాంకు శాఖలకు రావాల్సిందేనని చెప్పారు.
‘బ్యాంకు అవసరాలు ఎక్కడ ఉన్నాయో మేం గుర్తిస్తాం. ఆయా ప్రాంతాల్లో శాఖలను ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 400 శాఖలు ప్రారంభించాలని మేం ప్లాన్ చేశాం’ దినేశ్ కుమార్ ఖరా చెప్పారు. 2024 మార్చి నెలాఖరు నాటికి ఎస్బీఐ నెట్ వర్క్ పరిధిలో 22,542 శాఖలు ఉన్నాయి.
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!
Bajaj CNG Bike | వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ మార్కెట్లోకి వచ్చేస్తోంది.. ముహూర్తం ఎప్పుడంటే..?!