SBI ATM Cash Withdrawals | ఖాతాదారులకు సురక్షిత లావాదేవీలు అందుబాటులోకి తేవడానికి భారతీయ స్టేట్బ్యాక్ (ఎస్బీఐ) చర్యలు తీసుకుంటూనే ఉన్నది. ఈ నేపథ్యంలో తాజాగా ఏటీఎం కేంద్రాల్లో డెబిట్‌కార్డుల సాయంతో నగదు విత్‌డ్రాయల్ చేయడానికి వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలకు అనుగుణంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నగదు లావాదేవీల్లో భద్రత కోసం నాలుగంకెల ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చింది.
అందులో భాగంగా ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవాలంటే ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాంక్ శాఖలో మీరు మీ ఖాతా తెరవడానికి నమోదు చేసిన మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.
దీని ప్రకారం ఏటీఎం కేంద్రానికి వెళ్లే సమయంలో డెబిట్ కార్డుతోపాటు వెంట మొబైల్ ఫోన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సంబంధిత లావాదేవీ కోసం వచ్చిన ఓటీపీ సరిగ్గా నమోదు చేయకుంటే నగదు లావాదేవీలు జరుగవు. అంటే క్యాష్ విత్‌డ్రాయల్ చేయలేరు. ఒక ఓటీపీలో ఒకసారి మాత్రమే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇక సాధారణంగా ఎస్బీఐ ఖాతాదారులు తమ బ్యాంక్ ఏటీఎంల్లో ఒకనెలలో ఐదు సార్ల వరకు ఉచిత నగదు విత్‌డ్రాయల్స్‌కు అనుమతి ఇస్తున్నది. ఇతర బ్యాంక్‌ల ఏటీఎంల వద్ద మూడు సార్ల వరకు ఉచితంగా నగదు విత్ డ్రా చేసుకునే ఫెసిలిటీ లభిస్తున్నది.