SBI OTP Withdrawal | ఏటీఎంల వద్ద మోసాలు, అనధికారిక లావాదేవీల నుంచి ఖాతాదారులను రక్షించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చర్యలు చేపట్టింది. ఎస్బీఐ ఏటీఎంల్లో నుంచి రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తున్న కస్టమర్లకు వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) పంపుతుంది. ఆ ఓటీపీ నమోదు చేస్తేనే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ ఖాతాదారులు తమ నగదు సురక్షితంగా ఉండాలనుకుంటే, బ్యాంకు ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రాయల్ సర్వీస్ వాడుకోవచ్చు.
2020 జనవరి ఒకటో తేదీ నుంచి ఎస్బీఐ ఈ ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చింది. ` ఎస్బీఐ ఏటీఎంల్లో లావాదేవీల కోసం మా ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రాయల్ సిస్టమ్.. మోసాలను నిరోధించే వ్యాక్సిన్. మోసాల నుంచి ఎల్లవేళలా మిమ్మల్ని రక్షించడమే మా మొదటి లక్ష్యం` అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎస్బీఐ ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ ఫెసిలిటీ ఎలా పని చేస్తుందో చూద్దాం.. :