శ్రీనగర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. నీటిలో తేలియాడే ఏటీఎమ్‌ను ఏర్పాటు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులోని ఒక హౌస్‌బోట్‌లో ఫ్లోటింగ్ ఏటీఎమ్‌ను ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా ఈ నెల 16న ప్రారంభించారు. శ్రీనగర్ పర్యాటక ప్రాంతానికి ఇది మరో ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. స్థానికులు, పర్యాటకుల వినియోగం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కాగా, శ్రీనగర్ దాల్ సరస్సులోని షికారాలపై ఇప్పటికే ఫ్లోటింగ్ కూరగాయల మార్కెట్, ఫ్లోటింగ్ పోస్టాఫీసు ఉండగా తాజాగా ఎస్బీఐ ఫ్లోటింగ్ ఏటీఎం కూడా వీటి సరసన చేరింది.
SBI opened an ATM on a Houseboat at #DalLake, Srinagar for the convenience of locals & tourists. It was inaugurated by the Chairman, SBI, on 16th August. The #FloatingATM in the popular Dal Lake fulfills a long-standing need & will be an added attraction to the charm of Srinagar. pic.twitter.com/nz3iddHIdp
— State Bank of India (@TheOfficialSBI) August 19, 2021