Independence day offer | దేశంలోని ప్రధాన ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రుణగ్రహీతలకు తీపి కబురు చెప్పింది. లోన్ తీసుకోవాలని భావిస్తున్న వారి కోసం ఒక మంచి ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో రుణం తీసుకోబోయే అందరికీ ప్రయోజనం కలుగనుంది. తమ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకునే వారికి ఇండిపెండెన్స్ డే ఆఫర్లో భాగంగా జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కల్పిస్తున్నట్లు తెలిపింది.
అంటే ఆ ఆఫర్లో హోమ్ లోన్ తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జీరో ప్రాసెసింగ్ ఫీజుతో హోమ్ లోన్స్ తీసుకుని మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి అంటూ ఎస్బీఐ ట్వీట్ కూడా చేసింది. జీరో ప్రాసెసింగ్ ఫీజుతోపాటు మరికొన్ని బెనెఫిట్స్ను కూడా ఎస్బీఐ ప్రకటించింది. మహిళలు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటుపై 5 బేసిస్ పాయింట్ల అదనపు తగ్గింపు లభిస్తుందని తెలిపింది. ఎస్బీఐ యోనో ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా వడ్డీ రేటుపై 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు లభిస్తుంది.