న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: దేశీయ బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహితలకు షాకిచ్చిం ది. బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ని 0.70 బేసిస్ పాయింట్లు(0.70 శాతం) పెంచింది. దీంతో బీపీఎల్ఆర్ రేటు 13.45 శాతానికి చేరుకున్నది. ఈ వడ్డీరేటు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది. అంతకుముందు ఈ రేటు 12.75 శాతంగా ఉన్నది. జూన్లో బీపీఎల్ఆర్ని పెంచిన బ్యాంక్.. మళ్లీ ఇప్పుడు సవరించింది. దీంతోపాటు బేస్రేటును కూడా 0.70 శాతం పెంచడంతో రేటు 8.7 శాతానికి చేరుకున్నది. బేస్ రేటు ఆధారంగా తీసుకున్న రుణాలపై వడ్డీ మరిం త పెరగనున్నది.