ఎస్బీఐ డిపాజిట్లపై వడ్డీ పెంపు అర శాతం వరకు పెంచిన సంస్థ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్‌దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు సవరించింది. ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం పెరిగిన వడ్డీరేట్లు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. పది నెలల తర్వాత వడ్డీరేట్లను పెంచడం విశేషం.
హైదరాబాద్, డిసెంబర్ 27: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్‌దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు సవరించింది. ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం పెరిగిన వడ్డీరేట్లు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. పది నెలల తర్వాత వడ్డీరేట్లను పెంచడం విశేషం. చివరిసారి ఫిబ్రవరి 2023లో డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది.
దీంతో 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు సవరించడంతో వడ్డీరేటు 3 శాతం నుంచి 3.50 శాతానికి చేరుకున్నది. అలాగే 46 నుంచి 179 రోజుల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం పెంచిన బ్యాంక్..180 నుంచి 210 రోజుల లోపు డిపాజిట్లపై రేటుని కూడా పావు శాతం సవరించింది.
ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీం కాలపరిమితి పెంపు
ప్రతిష్ఠాత్మకంగా ఎస్బీఐ బ్యాంక్ జారీ చేసిన ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీం కాలపరిమితిని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. 400 రోజుల కాలపరిమితి కలిగిన ప్రత్యేక డిపాజిట్ స్కీంపై 7.10 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని చెల్లిస్తున్నది.
ఎఫ్డీలపై ఎస్బీఐ వడ్డీరేట్లు(శాతంలో)

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

