SBI Loan Rates Rise | ఇల్లు మొదలు ఏ రుణమైనా ఇక కాస్ట్లీ.. ఎందుకంటే?!
SBI Loan Rates Rise | ఎస్బీఐలో వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెరుగనున్నాయి. ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది.
SBI Loan Rates Rise | మీరు సొంతింటి కొనుగోలు కోసం గానీ.. వాహనం కొనుగోలు కోసం గానీ.. వ్యక్తిగత రుణం గానీ తీసుకుంటున్నారా.. అయితే వడ్డీరేట్లు పెరుగబోతున్నాయ్. దేశంలోనే కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ.. రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా రుణాలపై పది బేసిక్ పాయింట్లు (బీపీఎస్) పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నెల 15వ తేదీ నుంచే ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్ల పెరుగుదల అమల్లోకి వచ్చింది. దీంతో ఇల్లు, ఆటో, ఇతర రుణాలు కాస్ట్లీ కానున్నాయి.
ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలలకోసారి ఎంసీఎల్ఆర్ రేట్లు 10 బేసిక్ పాయింట్లు పెరుగుతాయని ఎస్బీఐ వెబ్సైట్ తెలిపింది. దీని ప్రకారం వడ్డీరేట్లు ఓవర్‌నైట్ నుంచి మూడు నెలల వరకు 6.65 నుంచి 6.75 శాతానికి పెరుగుతాయి. ఆరు నెలల టెన్యూర్ రుణాలపై వడ్డీరేటు 7.05 శాతం, ఏడాది గడువు గల రుణాలపై 7.10, రెండేండ్ల గడువు రుణాలపై 7.30, మూడేండ్ల వ్యవధి గల రుణాలపై 7.40 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
గతవారం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కూడా ఎంసీఎల్ఆర్ రేట్లు 0.05 శాతం పెంచి వేసింది. ఈ నెల 12 నుంచి పెంచిన ఎంసీఎల్ఆర్ రేట్లు అమల్లోకి వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.
ఎంసీఎల్ఆర్ అంటే..?
ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్). ఆర్బీఐ నూతన నిబంధనల ప్రకారం కమర్షియల్ బ్యాంకులు తాము మంజూరు చేసే వివిధ రకాల రుణాలపై వడ్డీరేట్లు పెంచుకోవచ్చు. బ్యాంకులు తమ నిధుల లభ్యత, వాటిని సమీకరించడానికి అయ్యే ఖర్చులు గణించి రుణాలపై విధించే వడ్డీరేటును ఖరారు చేస్తాయి. ఇక నుంచి రుణాలు తీసుకోవడానికి వచ్చే వారికి ఎంసీఎల్ఆర్ ఆధారంగా వడ్డీరేట్లు పెరుగుతాయి. హోంలోన్ రీసెట్ గడువు తేదీ వచ్చాక ఎంసీఎల్ఆర్ ప్రకారం వారి నెలవారీ ఈఎంఐ చెల్లింపుల మొత్తం పెరుగుతాయి. ఈ నెల 8న ప్రకటించిన ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

