SBI | ఆర్బీఐ పెంచిన రెపోరేట్‌కు అనుగుణంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎంపిక చేసిన టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) పై వడ్డీరేటు 15 బేసిక్ పాయింట్లు పెంచేసింది. ఈ నెల 13 (శనివారం) నుంచి ఎఫ్డీలపై సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి. రూ.2 కోట్ల లోపు ఎఫ్డీలకు పెంచిన వడ్డీరేట్లు అమలవుతాయి. సాధారణ ప్రజానీకానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 2.90 నుంచి 5.65 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 3.40 నుంచి 6.45 శాతానికి వడ్డీ పెంచేసింది. ఇంతకుముందు జూన్ 14న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించింది.
శనివారం (13.8.2022) నుంచి సాధారణ ప్రజలకు 180 రోజుల నుంచి 210 రోజుల్లోపు గడువు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 4.55 శాతానికి పెంచింది. ఏడాది నుంచి రెండేండ్ల లోపు గడువు ఎఫ్డీలపై 5.30 నుంచి 5.45 శాతానికి వడ్డీరేటు పెరిగింది. రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.50 శాతం, మూడేండ్ల నుంచి ఐదేండ్ల లోపు ఎఫ్డీలపై 5.60 శాతం, ఐదేండ్ల నుంచి పదేండ్ల లోపు ఎఫ్డీలపై 6.65 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది.
సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) పై 3.40 శాతం నుంచి 6.45 శాతం వరకు వడ్డీరేట్లు పెంచివేసింది. ఏడు రోజుల గడువు నుంచి పదేండ్ల లోపు గడువు వరకు గల ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. తాజా ఫిక్స్డ్ డిపాజిట్లకు, మెచ్యూర్డ్ డిపాజిట్ల రెన్యూవల్స్‌కు వడ్డీరేట్ల పెంపు వర్తిస్తుందని ఎస్బీఐ వెల్లడించింది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లకు పెంచిన వడ్డీరేట్లు అమలవుతాయి.