న్యూఢిల్లీ, మే 5: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 నుంచి 26 వరకు రెండు రోజుల పాటు మెరుపు సమ్మె చేస్తున్నట్టు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ప్రకటించింది. పెన్షన్ ఫండ్ మేనేజర్ ఆప్షన్తోపాటు మరో 16 డిమాండ్లు నెరవేర్చడం లేదని యాజమాన్యంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. కార్మికుల హక్కులు పద్ధతి ప్రకారం అణచివేయబడుతున్నాయని, దశాబ్దాల పోరాటం ద్వారా కష్టపడి సాధించుకున్న రక్షణలు నీరుగారిపోతున్నాయని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఒప్పందాలు కేవలం నామమాత్రపు తంతులుగా మారిపోయాయని, అలాగే అసమ్మతి స్వరాలు పక్కన పెడుతున్నారని ఏఐఎస్బీఐఎస్ఎఫ్ పేర్కొంది.