న్యూఢిల్లీ, మే 21 : దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగుల సమ్మె బాటపట్టారు. తగినంత మంది ఉద్యోగులను నియమించుకోవడంతోపాటు పలు డిమాండ్లను సాధించాలనే ఉద్దేశంతో ఈ నెల 25 నుంచి 26 వరకు రెండురోజుల పాటు సమ్మె చేస్తున్నట్టు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్(ఏఐఎస్బీఐఎస్ఎఫ్) ప్రకటించింది. దీంతో వరుసగా ఐదు రోజులపాటు ఎస్బీఐ శాఖలు మూతపడనున్నాయి.
ఈ నెల 23న నాలుగో శనివారం, ఆ తర్వాత రోజు ఆదివారం, 25 నుంచి 26 వరకు రెండురోజులపాటు ఉద్యోగుల సమ్మెచేస్తుండటం, ఆ మరుసటి రోజు బక్రీద్ కావడంతో పలు రాష్ర్టాల్లో బ్యాంకులు మూసివేసివుంచనున్నారు. దీంతో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నియామకాలు, సాయుధ గార్డుల నియామకం, ఎన్పీఎస్ ఉద్యోగులకు పెన్షన్ నిధి ఏర్పాటు చేయాలని గత కొన్నేండ్లుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు వారానికి పనిదినాలను ఐదు రోజులకు కుదించాలని డిమాండ్ ప్రధానంగా ఉన్నది.