SBI Door Step Service | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ తమ కస్టమర్ల ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు అందుబాటులోకి తెస్తున్నది. కరోనా మహమ్మారి వేళ బయటికి రాలేని సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అంధులకోసం ఈ విధానం అమల్లోకి వచ్చింది. 70 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అంధులు..`ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల`కు అర్హులు. సింగిల్ ఖాతాదారులు, జాయింట్ ఖాతాదారుల్లో సర్వైవర్ లేదా ఫార్మర్ కూడా ఈ సేవలు పొందొచ్చు.
బ్యాంకు హోం బ్రాంచ్‌కు ఐదు కి.మీ. విస్తీర్ణంలో రిజిస్టర్డ్ చిరునామా గల వారు ఈ ప్రయోజనాలు అందుకోవచ్చు. `ఎస్బీఐ ఎట్ యువర్ డోర్‌స్టెప్!!! దివ్యాంగులైన కస్టమర్లకు ఉచితంగానే ఎస్బీఐ సాయం!!!, నెలలో మూడుసార్లు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందిస్తామంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఎస్బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (డీఎస్బీ) సేవలు పొందాల్సి ఉంటుంది. అదెలాగో తెలుసుకుందామా..!
ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందాలని భావించే వారు 1800 1037 188, 1800 1213 721 టోల్ ఫ్రీ నంబర్లను రిజిస్టర్ చేసుకోవాలి.