SBI | ప్రభుత్వ రంగ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్ జారీ చేసింది. ఈ నెల 11న శనివారం దాదాపు గంట సమయం పాటు ఎస్బీఐ సేవలు నిలిచిపోనున్నాయి. డౌన్‌టైమ్ కారణంగా పలు సేవలు నిలిచిపోతాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎస్బీఐకి కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, మొబైల్ బ్యాంక్, యూపీఐ తదితర సర్వీసుల ద్వారా కోట్లాది రూపాయాల లావాదేవీలు జరిగే విషయం తెలిసిందే. దాంతో మెయింటెనెన్స్ కారణంగా లావాదేవీలు నిలిచిపోనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 11న శనివారం తెల్లవారు జామున 1.10 గంటల నుంచి 2.10 గంటల వరకు డౌన్‌టైమ్ కారణంగా సర్వీసులు ప్రభావితమవుతాయని పేర్కొంది. ఈ సమయంలో బ్యాంకు డిజిటల్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఎస్బీఐ తెలిపింది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS), యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) సేవలు 1.10 నుంచి 2:10 వరకు ప్రభావితమవుతాయని పేర్కొంది. తిరిగి 2.10 గంటల నుంచి యథావిధిగా సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ క్రమంలో ఖాతాదారులు
తమ లావాదేవీలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఎస్బీస్ కోరింది. ఈ మేరకు సహకరించాలని కోరింది. డౌన్‌టైమ్ సమయంలో ఏటీఎం, యూపీఐ లైట్ సేవలను ఉపయోగించుకోవచ్చని చెప్పింది. యూపీఐ లైట్ ద్వారా రూ.వెయ్యి కంటే తక్కువ పిన్లెస్ సర్వీసెస్ అయిన యూపీఐ లైట్‌ను ఉపయోగించుకోవచ్చని చెప్పింది.