SBI Offers Bonanza | పండుగల సీజన్ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ తన రిటైల్ కస్టమర్లపై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో రిటైల్ కస్టమర్లకు ఈ ఆఫర్లు అందిస్తున్నట్లు సోమవారం తెలిపింది. ఇప్పటికే ఈ నెలాఖరు వరకు ఇంటి రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసిన ఎస్బీఐ.. తాజా కార్ల కొనుగోలు దారులకు ఇది వర్తింప చేస్తున్నది.
కార్ల కొనుగోలు దారులకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రాయితీతోపాటు 90 శాతం రుణ పరపతి కల్పిస్తున్నది. ఎస్బీఐ యాప్ యోనో ద్వారా కారు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 25 బేసిక్ పాయింట్ల వడ్డీ రాయితీ అందిస్తున్నది. దీని ప్రకారం కార్ల రుణాలపై యోనో యాప్ యూజర్లకు 7.5 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం పండుగల సీజన్ మొదలైనందున బంగారం రుణాలపై వడ్డీరేటు 75 బేసిక్ పాయింట్లు తగ్గించింది. దీని ప్రకారం అన్ని చానళ్ల ద్వారా బంగారం కొనుగోలుకు రుణాలు తీసుకునే వారికి 7.5 శాతం వడ్డీ వసూలు చేస్తున్నది. యోనో యాప్ ద్వారా బంగారం రుణాలకు దరఖాస్తు చేసేవారికి పూర్తిగా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నది.
పర్సనల్ అండ్ పెన్షన్ లోన్ కస్టమర్లకూ పూర్తిగా ప్రాసెసింగ్ ఫీజు రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. కోవిడ్-19పై పోరులో ముందు వరుసలో నిలిచే ఆరోగ్య కార్యకర్తలకు పర్సనల్ రుణాలపై 50 బేసిక్ పాయింట్ల మేరకు ప్రత్యేకంగా వడ్డీ రాయితీ అందిస్తున్నది. పర్సనల్ లోన్‌తోపాటు బంగారం, కార్ల రుణాలు తీసుకునే హెల్త్‌కేర్ వర్కర్లకు 50 బేసిక్ పాయింట్ల వడ్డీ రాయితీ వర్తిస్తుంది.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎస్బీఐ తన రిటైల్ డిపాజిటర్లకు ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్లు’ అనే పేరిట ఆఫర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ నెల 15 నుంచి వచ్చేనెల 14 వరకు 75 రోజులు, 75 వారాలు, 75 నెలల గడువుతో చేసే టర్మ్ డిపాజిట్లపై అదనంగా 15 బేసిక్ పాయింట్ల వడ్డీ అందిస్తున్నది.
‘మా కస్టమర్లు తీసుకునే రుణాలపై వారి సొమ్ము ఆదా చేయడానికి ఈ ఆఫర్లు ఉపకరిస్తాయని మేం విశ్వసిస్తున్నాం. పండుగ సంబురాలకు ఇవి అదనం అవుతాయి’ అని ఎస్బీఐ రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరు వరకు తీసుకునే ఇంటి రుణాలపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ ఇంటి రుణాలపై 6.70 శాతం వడ్డీరేటు వసూలు చేస్తున్నది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
జిల్లా వచ్చె.. గడ్డం పాయె ఢాం ఢాం ఢాం..
మేఘాలయలో హింస : హోం మంత్రి రాజీనామా
దేశం విడిచి ఎందుకు వెళ్లిపోయానంటే..? : అష్రఫ్ ఘనీ
ఆ మెసేజ్ అందడానికి 18 గంటలు పట్టింది..!
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన