SBI | బ్యాంకు మేనేజ్మెంట్కు చెందిన వ్యక్తులవి అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న డీప్ ఫేక్ వీడియోలను నమ్మొద్దని ఎస్బీఐ కస్టమర్లను హెచ్చరించింది. ఆయా వీడియోల్లో పేర్కొన్న పథకాలతో బ్యాంకుకు గానీ, బ్యాంకు అధికారులకు గానీ ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఫలానా పథకంలో పెట్టుబడి పెట్టాలంటూ సదరు వీడియోలో సలహాలు ఇస్తున్నారని, ఇటువంటి అసాధారణ, అవాస్తవమైన రాబడి ఇచ్చే హామీలను ఎస్బీఐ చేయబోనది పేర్కొంది. కనుక ఇటువంటి మోసపూరిత వీడియోల భారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలంటూ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా ఎస్బీఐ పోస్ట్ పెట్టింది. భారీ రిటర్నులు లభిస్తాయంటూ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా టాప్ మేనేజ్మెంట్ చెబుతున్నట్లు రూపొందించిన వీడియోలు సోషల్ మీడియా వేదికలపై హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన ఎస్బీఐ.. ఇవన్నీ నకిలీ వీడియోలని స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేసింది.