ముంబై: ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ పెట్రో కెమికల్ రిఫైనరీలో సౌదీ ఆరామ్ కో వాటాల కొనుగోలు ఒప్పందం చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. రిలయన్స్ పెట్రో కెమికల్స్‌లో సౌదీ అరామ్ కో 20 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్లు వినికిడి. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం విలువ 20-25 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా. త్వరలో దీనిపై రిలయన్స్ అధికారిక ప్రకటన చేస్తుందని సమాచారం.
ఈ ఒప్పందం వల్ల నేరుగా రిలయన్స్ రిఫైనరీ కేంద్రాలకు క్రూడ్ ఆయిల్ చేరుతుంది. మరోవైపు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద చమురు సంస్థ ఆరామ్‌కోలో రిలయన్స్ పార్టనర్‌గా చేరనున్నది. రెండు సంస్థల మధ్య కుదిరే ఒప్పందంతో 1.9 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆరామ్‌కోలో రిలయన్స్‌కు ఒక శాతం వాటా లభించవచ్చు. దీనిపై స్పందించడానికి ఆరామ్ కో ప్రతినిధులు ముందుకు రాలేదు.