బెంగళూరు, ఫిబ్రవరి 7:ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కే సత్యనారాయణ రాజును నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నియామకం వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది. డిసెంబర్ 31, 2022న పదవీ విరమణ చేసిన ఎల్వీ ప్రభాకర్ స్థానాన్ని రాజు భర్తి చేయనున్నారు. మార్చి 10, 2021 నుంచి కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ రాజు..బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్)లో పీజీ, అలాగే సీఏఐఐబీ చేశారు కూడా. కార్పొరేట్, రిటైల్, వ్యవసాయ రుణాలు, క్రెడిట్ మానిటరింగ్, రికవరీ విభాగాల్లో మంచి పట్టున్న రాజుకు డిజిటల్ సాంకేతికపై కూడా అనుభవం ఉన్నది.
నూతన ఈడీగా హర్దీప్ సింగ్
కెనరా బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హర్దీప్ సింగ్ అహ్లువాలియా నియమితులయ్యారు. 1992లో అలహాబాద్ బ్యాంక్లో బ్యాంకింగ్ కేరియర్ను ప్రారంభించిన సింగ్..బ్యాంకింగ్ రంగం లో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.