న్యూఢిల్లీ, నవంబర్ 17: సోషల్ మీడియా సంస్థ మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్య దేవనాథన్ నియమితులయ్యారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సప్‌ల్లో సేవలు అందించిన ఆమె..అజిత్ మోహన్ స్థానాన్ని భర్తి చేయనున్నారు. ‘ఇండియా హెడ్‌గా సంధ్యకు స్వాగతం చెబుతున్నాను. వ్యాపార విస్తరణ, టీంలు, ఇన్నోవేషన్, బలమైన ఒప్పందాలు కుదుర్చడంలో ఆమె రికార్డు చాలా బాగున్నది’ అని మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ తెలిపారు. 2016లో మెటాలో చేరిన దేవనాథన్..సింగపూర్, వియత్నాంలతోపాటు మెటా ఈ-కామర్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేశారు. జనవరి 1, 2023న ఆమె కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు.