Samsung Galaxy S25 Ultra | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఆల్ట్రా (Samsung Galaxy S25 Ultra) సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీతో వస్తోంది. ఆపిల్ ఐ-ఫోన్ 15ప్రో లేదా ఐ-ఫోన్ 16ప్రో ఫోన్లలో మాదిరిగా అప్ గ్రేడెడ్ 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా ఉంటది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఆల్ట్రా ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ వన్‌యూఐ 7 వర్షన్‌పై పని చేస్తుంది. శాంసంగ్ యాప్స్ గూగుల్ జెమినీ ఏఐ అసిస్టెంట్ మద్దతుతో పని చేస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా ఫోన్ 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.1,12,300 (1,299 అమెరికా డాలర్లు), 12జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.1,43,400 (1659 యూఎస్ డాలర్లు) పలుకుతుంది. భారత్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా ఫోన్ ధర రూ.1,29,999 వద్ద ప్రారంభం అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా పోన్ టైటానియం బ్లాక్ టైటానియం గ్రే, టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం వైట్ సిల్వర్ కలర్ ఆప్షన్లతోపాటు టైటానియం జేడ్ గ్రీన్, టైటానియం జెట్ బ్లాక్, టైటానియం పింక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలోనూ లభిస్తుంది. అమెరికాలో గురువారం నుంచి ఫోన్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి ఫోన్లు లభిస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ న్యూ యూఐ7 ఇంటర్ ఫేస్ వర్షన్‌పై పని చేస్తుంది. ఏడేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్, సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తోంది. 6.9 అంగుళాల (1400×3120 పిక్సెల్స్) డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా ఆర్మూర్ 2 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 200 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా విత్ 2ఎక్స్ ఇన్ సెన్సర్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేసన్ (ఓఐఎస్), అప్ డేటెడ్ 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ ఓఐఎస్, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ ఓఐఎస్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీ, యూడబ్ల్యూబీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. శాంసంగ్ ఎస్ పెన్ స్టైలస్‌కు మద్దతుగా ఉంటుంది. 45వాట్ల (వైర్డ్, చార్జర్ వేర్వుగా లభిస్తుంది) చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ వైర్ లెస్ చార్జింగ్ 2.0 (15వాట్లు), వైర్ లెస్ పవర్ సేర్ సపోర్ట్ కలిగి ఉంటుంది.