దక్షిణ కొరియా ; దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజం సామ్సంగ్.. బుధవారం రాత్రి తమ పాపులర్ బ్రాండ్ గెలాక్సీ సిరీస్లో ఎస్25 మాడళ్లను ఆవిష్కరించింది. ఎస్25, ఎస్25 ప్లస్, ఎస్25 అల్ట్రా పేరిట వీటిని పరిచయం చేసింది. మరిన్ని ఆధునిక ఫీచర్లతో వచ్చిన వీటి ధరల శ్రేణి భారతీయ మార్కెట్లో రూ.85వేల నుంచి 1.65 లక్షల వరకు ఉంటుందని తెలుస్తున్నది. 16జీబీ ర్యామ్, గరిష్ఠంగా 1టీబీ స్టోరేజీ సామర్థ్యం వీటిలో ఉన్నాయంటున్నారు.