Samsung Galaxy S24 Ultra | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ త్వరలో కొత్త కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రానున్నది. గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24+ ఫోన్లతోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఫోన్ టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వయోలెట్ కలర్ ఆప్షన్లలో గత జనవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించారు. తాజాగా టైటానియం ఎల్లో కలర్ ఆప్షన్లో అందుబాటులోకి రానున్నది ఫోన్.
ఇంకా శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్‌లో టైటానియం బ్లూ, టైటానియం గ్రీన్, టైటానియం ఆరంజ్ రంగుల్లోనూ లభ్యం అవుతుంది. గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24+ ఫోన్లు అంబర్ ఎల్లో, కోబాల్ట్ వయోలెట్, మార్బుల్ గ్రే, ఓనిక్స్ బ్లాక్ షేడ్స్, జేడ్ గ్రీన్, సఫైర్ బ్లూ, శాండ్ స్టోన్ ఆరంజ్ షేడ్స్ ల్లోనూ లభిస్తాయి.
జనవరిలో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లలో గెలాక్సీ ఎస్24 ఫోన్ రూ.79,999, గెలాక్సీ ఎస్24+ ఫోన్ రూ.99,999, గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఫోన్ రూ.1,29,999లకు లభిస్తాయి. గెలాక్సీ ఎస్ 24 ఆల్ట్రా ఫోన్ టైటానియం చేసిస్తోపాటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తాయి. గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్ 24+ ఫోన్లు ఎక్స్ నోస్ 2400 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తాయి.