Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ ఎస్24 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రమోషనల్ ప్రైస్ కింద ధర తగ్గిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. కంపెనీ వెబ్ సైట్, ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో రూ.60 వేల లోపు ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లు సొంతం చేసుకోవచ్చు. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ డిస్కౌంట్ అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ రూ.59,999లకే లభిస్తుంది. బ్యాంక్ ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ రూ.12,000తోపాటు అప్ గ్రేడ్ బోనస్ రూ.3000తో ధర తగ్గుతుంది. వాస్తవంగా గత జనవరిలో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.74,999లకు లభిస్తుంది. ఆఫర్లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ కొనుగోలు చేసే వారికి ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద రూ.40 వేల వరకూ రాయితీ అందిస్తోంది శాంసంగ్.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లిస్టింగ్ లో రూ.57,490 పలుకుతోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.24,250లకే సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతున్నది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 పోన్ 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో లభిస్తుంది. ఎక్స్ నోస్ 2400 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ వరకూ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14 విత్ యూఐ 6.1.1 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 12 -మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ సెన్సర్ కెమెరా, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 25వాట్ల చార్జింగ్, ఫాస్ట్ వైర్ లెస్ చార్జింగ్ 2.0, వైర్ లెస్ పవర్ షేర్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది.