Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24) ఫోన్ ను జనవరిలో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని లాంచింగ్ ధర రూ.79,999. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొనుగోలు ధరపై లిమిటెడ్ ఆఫర్‌గా డిస్కౌంట్ ధరపై అందజేస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. వచ్చే వారం వరకూ ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 పోన్ 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లిమిటెడ్ ఆఫర్‌గా శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ మీద రూ.12 వేల ధర తగ్గించింది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.62,999లకు లభిస్తుంది. ఈ వేరియంట్ వాస్తవ ధర రూ.74,999. ఇదిలా ఉంటే, రూ.5,666 చొప్పున 24 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకూ అందుబాటులో ఉంటుంది. ఇదే ఫోన్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ వాస్తవ ధర రూ.79,999 కాగా రూ.67,999, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.89,999 నుంచి రూ.77,999లకు తగ్గించారు. ఇదిలా ఉంటే అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ రూ.56 వేలకు లిస్టయితే, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.62 వేలకు విక్రయిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు విజన్ బూస్టర్ మద్దతుతో 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ + డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్ కలిగి ఉంటుంది. సెలెక్టెడ్ రీజియన్లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 మొబైల్ ప్లాటినం ప్రాసెసర్, భారత్‌లో ఎక్స్‌నోస్ 2400 ఎస్వోసీ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ వైడ్ కెమెరా, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 25వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతు, 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్, వైర్ లెస్ పవర్ షేర్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.