Samsung Galaxy S24 FE | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఎక్సినోస్ 2400ఈ ప్రాసెసర్, 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్, 10-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలతో వస్తోందీ ఫోన్. సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్ లేట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లకు మద్దతుగా ఫోన్ నిలుస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.59,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.65,999లకు లభిస్తాయి. అక్టోబర్ మూడో తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. బ్లూ, గ్రాఫైట్, మింట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. ప్రీ బుకింగ్ ఆఫర్లలో రూ.4799 విలువైన శాంసంగ్ కేర్+ ప్యాకేజీ రూ.999లకే లభిస్తుంది. 12 నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 6.1 వర్షన్ పై పని చేస్తుంది. ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2340 పిక్సెల్స్) డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 4ఎన్ఎం డెకా కోర్ ఎక్స్ నోస్ 2400ఈ ఎస్వోసీ విత్ 8 జీబీ ర్యామ్ అండ్ 512 జీబీ స్టోరేజీ కెపాసిటీతో వస్తోందీ ఫోన్.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ విత్ ఓఐఎస్, 12 -మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 10-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 25వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, శాంసంగ్ నాక్స్ వాల్ట్ తో వస్తోంది.