Samsung Galaxy S23 | శాంసంగ్ తన ప్రీమియం గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లు అదనంగా మరో రెండు కలర్ ఆప్షన్లలో మార్కెట్లలోకి తేనున్నది. గత ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23, శాంసంగ్ గెలాక్సీ ఎస్23+, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా మోడల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రారంభంలో నాలుగు రంగుల్లో ఈ ఫోన్ ఆవిష్కరించింది. తాజాగా మరో రెండు అదనపు రంగుల్లో ఈ ఫోన్లను తీసుకొస్తున్నట్లు గురువారం వెల్లడించింది.
స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ విత్ 45వాట్ల వైర్డ్ లేదా 15 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో మార్కెట్లో ఉంది. గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా ఫోన్ 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.1,24,999, 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.1,34,999, హై ఎండ్ ఫోన్ 12 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.1,54,999లకు లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఆల్ట్రా ఫోన్ ఫాంటోమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగుల్లో లభిస్తుంది. అదనంగా గ్రాఫైట్, లైమ్, స్కై బ్లూ, రెడ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
తాజాగా త్వరలో మరో రెండు కలర్ వేరియంట్లను మార్కెట్లో ఆవిష్కరిస్తామని శాంసంగ్ వెల్లడించింది. 6.8 అంగుళాల ఎడ్జ్ క్యూహెచ్డీ + డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ స్లే, విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. క్వాడ్ రేర్ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. 200-మెగా పిక్సెల్ ప్రైమరీ వైడ్ సెన్సర్, 12-మెగా పిక్సలె్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, రెండు 10-మెగా పిక్సెల్ సెన్సర్స్ విత్ టెలిఫొటో లెన్స్, సెల్ఫీల కోసం 12-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూ టూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.