Samsung Galaxy M55 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లలో ఇది స్లిమ్మెస్ట్గా ఉంటుందని తెలుస్తున్నది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్సెట్తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 వర్షన్ పై పని చేస్తుంది ఫోన్. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్ తోపాటు 256 జీబీ స్టోరేజీ వరకూ ఆప్షన్లు ఉంటాయని తెలుస్తున్నది.
108-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ ఫోన్‌తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎం15 ఫోన్ కూడా ఆవిష్కరిస్తారని సమాచారం. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్ గల ఈ ఫోన్ వచ్చేనెలలో ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. ఎక్స్ నోస్ 1380 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 5జీ, 4జీ ఎల్టీటీఈ, వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.