Samsung Galaxy M34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) భారత్ మార్కెట్లోకి ఈ నెల ఏడో తేదీన తన శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) ఫోన్ ఆవిష్కరించనున్నది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 50-మెగా పిక్సెల్స్ కెమెరాతో అందుబాటులోకి వస్తున్నది శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G).
శాంసంగ్ (Samsung) తీసుకువస్తున్న తన మిడిల్ బడ్జెట్ ఫోన్.. గెలాక్సీ ఎం345జీ ఫోన్ ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) ఫోన్ భారత్ మార్కెట్లలో రెండు వేరియంట్ల (8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ)లో లభిస్తుంది. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.25 వేలు, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.30 వేలు ఉండొచ్చునని తెలుస్తున్నది.
అమెజాన్ వెబ్ సైట్లో శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ లిస్టింగ్ అయింది. ఈ ఫోన్ సిల్వర్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎల్ఈడీ ఫ్లాష్‌తో కెమెరా మాడ్యూల్ వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) ఫోన్ 6.46-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అండ్ హై రిజొల్యూషన్ తో వస్తుంది. డిస్ ప్లేపై వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ కూడా ఉంటది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమెరా లెన్స్ 50 మెగా పిక్సెల్స్ విత్ ఓఐఎస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 1080 ఒక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.