Samsung Galaxy M34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్..వచ్చేనెల ఏడో తేదీన భారత్ మార్కెట్లో తన శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. తన అధికారిక సోషల్ మీడియా చానెల్స్ ద్వారా శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ రానున్నది.
ఈ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 1080 ఎస్వోసీ చిప్సెట్తో వస్తుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సలె్ సెకండరీ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలు, వీడియో చాట్స్ కోసం 13-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ 6000 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్ తో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఈ ఫోన్ విజన్ బూస్టర్ టెక్నాలజీతో వస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ వై-ఫై 802.11 /బీ/జీ/ఎన్/ఏసీ, ఎన్ఎఫ్సీ, బ్లూ టూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.ఈ ఫోన్‌తోపాటు గెలాక్సీ జడ్ ఫ్లిప్5, గెలాక్సీ జడ్ ఫోల్డ్5 వంటి ఫోల్డబుల్ ఫోన్లు ఆవిష్కరించనున్నది. ఇంకా గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ టాబ్ ఎస్9 సిరీస్ కూడా ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది