Samsung Galaxy F05 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05 (Samsung Galaxy F05) ఫోన్ను భారత్ మార్కెట్లో మంగళవారం ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ తో వస్తోంది. 25 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం05/ శాంసంగ్ గెలాక్సీ ఏ05 ఫోన్లను రీ బ్యాడ్జ్ చేసి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05 ఫోన్ ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999లకు లభిస్తుంది. ఈ నెల 20 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్, సెలెక్టెడ్ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుందీ స్మార్ట్ ఫోన్.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05 ఫోన్ 6.7 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్ కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీతో మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్ తో పని చేస్తుంది. వర్చువల్ గా ఫోన్ ర్యామ్ మరో 4జీబీ పెంచుకోవడంతోపాటు మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 5 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05 డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 25 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ గల ఫోన్ సెక్యూరిటీ కోసం ఫేస్ అన్ లాక్ ఫీచర్ కలిగి ఉంటుంది.