Samsung Galaxy | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ భారత్ మార్కెట్లో తన శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్లను సోమవారం ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్లూ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తోపాటు 6.6 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాలతో వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 6.1 వర్షన్‌పై ఈ ఫోన్లు పని చేస్తాయి. ఫోర్ జనరేషన్స్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్, ఐదేండ్ల పాటు సెక్యూటీ అప్ డేట్స్ అందిస్తాయి. 25 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తాయి. ఐస్ బ్లూ, నేవీ షేడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఇక శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్లు 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఈ ఫోన్లు ఐస్ బ్లూ, నేవీ, లిలాక్ రంగుల్లో లభిస్తాయి. ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ల ధరలను శాంసంగ్ వెల్లడిస్తుందని అంచనా వేస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్లు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2408 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. విజన్ బూస్టర్ ఫీచర్ తోపాటు 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నాయి. ఒక్టాకోర్ ప్రాసెసర్ తో వస్తున్నాయి.
శాంసంగ్ ఏ55 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఆటో ఫోకస్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 12-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఓఐఎస్ విత్ ఆటో ఫోకస్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 5-మెగా పిక్సెల్ మాక్రో షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో స్టోరేజీ సామర్థ్యం ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్లకు 5జీతోపాటు వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. యాక్సెలరో మీటర్, గైరో సెన్సర్, జియో మ్యాగ్నటిక్ సెన్సర్, హాల్ సెన్సర్, లైట్ సెన్సర్, వర్చువల్ ప్రాగ్జిమిటీ సెన్సర్, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ కెమెరా ఉంటుంది. వీటితోపాటు శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉంటుంది. సింగిల్ చార్జింగ్ తో రెండు ఫోన్ల బ్యాటరీలో 83 గంటల ఆడియో ప్లే బ్యాక్ టైం కలిగి ఉంటాయి.