Samsung Galaxy A34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఫోన్ ధర రూ.6000లకు పైగా తగ్గించింది. గతేడాది మార్చిలో శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ (Samsung Galaxy A54 5G) ఫోన్‌తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్వోసీ (Mediatek Dimensity 1080 SoC) చిప్సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A54 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.30,999 కాగా, ఇప్పుడు రూ.2,4499లకే లభిస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999 కాగా, ఫ్లిప్ కార్ట్ ద్వారా రూ.6,500 రాయితీతో రూ.26,499లకే అందుబాటులో ఉంటుంది.
నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.4,073 నుంచి ప్రారంభం అవుతుండగా, స్టాండర్డ్ ఈఎంఐ ఆప్షన్ రూ.1,187 నుంచి మొదలవుతుంది. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా భారీగా జరిపే కొనుగోళ్లపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఇతర పేమెంట్ ఆర్డర్ల ద్వారా ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A54 5G) ఫోన్ మీద ఇన్స్టంట్ డిస్కౌంట్ రూ.3,500 తగ్గింపుతో రూ.27,499లకే అందుబాటులోకి తెచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A54 5G) ఫోన్ సన్ లైట్ కింద విజిబిలిటీకి మద్దతుగా విజన్ బూస్టర్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.6-అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ ఫుల్ హెచ్డీ + రిజొల్యూషన్‌తో పని చేస్తుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్వోసీ (octacore MediaTek Dimensity 1080 SoC) ప్రాసెసర్‌తో వస్తున్నది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్ (Samsung Galaxy A54 5G) ఎల్ఈడీ ఫ్లాష్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ మాక్రో లెన్స్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.