Samsung Galaxy A Series | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన గెలాక్సీ ఏ25 5జీ (Samsung Galaxy A25 5G), గెలాక్సీ ఏ15 5జీ (Samsung Galaxy A15 5G) ఫోన్లను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాలతోకూడిన ట్రిపుల్ రేర్ కెమెరా, 6.5-అంగుళాల అమోలెడ్ స్క్రీన్ డిస్ ప్లేతో వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ (Samsung Galaxy A25 5G) ఫోన్ ఎక్స్ నోస్ 1280 ఎస్వోసీ చిప్ సెట్ (Exynos 1280 SoC), గెలాక్సీ ఏ15 5జీ (Samsung Galaxy A15 5G) ఫోన్ ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో వచ్చింది. రెండు ఫోన్లూ వాటర్ డ్రాప్ -స్టైల్ డిస్ ప్లే నాచ్‌తో సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ ఫోన్లు 25 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్లుగా వస్తున్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ (Samsung Galaxy A15 5G), శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ (Samsung Galaxy A25 5G) ఫోన్ల ధరలు రూ.17,999 నుంచి ప్రారంభం అవుతాయి. అయితే ఈ ఫోన్ల ర్యామ్, స్టోరేజీ కెపాసిటీ వివరాలు వెల్లడించలేదు. ఎస్బీఐ కార్డ్స్‌తో కొనుగోలు చేసిన వారికి రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది. గెలాక్సీ ఏ25 5జీ ఫోన్ బ్లూ, బ్లూ బ్లాక్, ఎల్లో షేడ్ కలర్స్లోనూ, గెలాక్సీ ఏ15 5జీ ఫోన్ బ్లూ బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్ యూఐ 5 వర్షన్ పై పని చేస్తాయి. ఐదేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్, నాలుగేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్ అందిస్తుందీ శాంసంగ్.
శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×408 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ ఫోన్ ఫుల్ హెచ్డీ+ (1080×408 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ ఫోన్ ఒక్టాకోర్ ఎక్స్‌నోస్ 1280 ఎస్వోసీ చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నది. శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ ఫోన్ ఒక్టాకోర్ చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ ఫోన్లు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఏఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్డ్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇక గెలాక్సీ ఏ15 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ కెమెరాతో వస్తున్నది. రెండు ఫోన్లలో సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ కెమెరాలు ఉంటాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ ఫోన్లు రెండూ 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి. యాక్సెలో మీటర్స్, గైరో సెన్సర్, జియో మాగ్నటిక్ సెన్సర్, లైట్ సెన్సర్, వర్చువల్ ప్రాగ్జిమిటీ సెన్సర్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో వస్తున్నాయి. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ సింగిల్ చార్జింగ్‌తో 21 గంటల వీడియో ప్లే బ్యాక్ టైం సేవలు పొందొచ్చు.