Samsung Galaxy A14 4G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ14 పేరుతో వస్తున్న ఈ ఫోన్లో ఎగ్జినోస్ 850 ఒక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. గెలాక్సీ ఏ13 వర్షన్ ఫోన్కు కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తున్నది. ఇది ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్ యూఐ 5.0 వర్షన్ మీద పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ14 రెండు వేరియంట్లలో లభ్యం అవుతుంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభ్యం అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ14 4జీ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 4జీబీ రామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ విత్ 90 హెర్ట్జ్ డిస్ ప్లే వేరియంట్ ఫోన్ రూ.16,499లకు లభిస్తున్నది.
ప్రస్తుతం కంపెనీ వెబ్ సైట్లోనే విక్రయానికి అందుబాటులో ఉంది. ఎస్బీఐ కార్డ్ మీద కొనే వారు రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ14 4జీ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ + (1080×2408 పిక్సెల్స్) రిజొల్యూషన్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లేతో వస్తున్నది. రెండేండ్ల పాటు ఓఎస్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 13-మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. 30ఎఫ్పీఎస్ వద్ద 1080 పీ వీడియోలు రికార్డు చేయొచ్చు. 4కే వీడియో ప్లే బ్యాక్ కెపాసిటీ ఉంటుంది. 4జీ ఎల్టీఈ నెట్ వర్క్ తోపాటు బ్లూ టూత్, 5గిగా హెర్జ్ట్ వై-ఫై కనెక్టివిటీ ఆప్షన్ కలిగి ఉంటుంది.