Samsung Credit Card | శాంసంగ్ ( Samsung ) పరిచయం అక్కర్లేని పేరు.. టీవీలు ( Televisions ) .. టాబ్లెట్లు ( Tablets ) .. స్మార్ట్ ఫోన్ల ( Smartphones ) వరకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన సంస్థ.. ఈ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం భారతీయ కస్టమర్ల కోసం తాజాగా ఫైనాన్సియల్ సేవ ( Finance Services ) ల్లోకి ఎంటర్ కావాలని నిర్ణయించింది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ( Axis Bank ), ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ `వీసా ( Visa )`తో కలిసి క్రెడిట్ కార్డు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రెడిట్ కార్డు యూజర్లకు ఏడాది పాటు అన్ని రకాల తమ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తున్నది. ఈఎంఐ, నాన్ ఈఎంఐ లావాదేవీలకు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.
స్మార్ట్ ఫోన్లు ( Smartphones ) , టాబ్లెట్లు ( Tablets ) , లాప్‌టాప్‌లు ( Laptops ) , టీవీలు ( Televisions ), రిఫ్రిజిరేటర్లు (ఫ్రిజ్‌లు – Refrigerators ), ఏసీలు ( AC ) , వాషింగ్ మిషన్ల ( Washing Machine ) కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. సంస్థ సర్వీస్ సెంటర్ పేమెంట్స్, శాంసంగ్ కేర్ + మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్, ఎక్స్టెండెడ్ వారంటీలకూ ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చు. ఆన్లైన్లో శాంసంగ్ వెబ్ పోర్టల్, శాంసంగ్ సాపింగ్, ఫ్లిప్‌కార్ట్ బుకింగ్స్‌కు క్యాష్‌బ్యాక్ ఆఫర్ వాడుకోవచ్చు. ఇక ఆఫ్‌లైన్‌లో పైన్‌ల్యాబ్స్ ( Pine Labs ), బెనో పేమెంట్ ఇంటర్ ఫేసెస్ ( Benow Payment Interfaces), ఆఫ్‌లైన్ & ఆన్లైన్లలో ఆథరైజ్డ్ శ్యామ్‌సంగ్ సర్వీస్ సెంటర్లలో ఆఫర్ వాడకంలో ఉంటుంది.
వీసా సిగ్నేచర్ ( Visa Signature ), వీసా ఇనిఫినిటీ ( Visa Infinite ) అనే పేర్లతో క్రెడిట్ కార్డు వస్తున్నది. వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డుపై నెలవారీగా రూ.2,500తోపాటు ఏడాదిలో రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీసా ఇనిఫినిటీ కార్డుపై నెలవారీగా రూ.5000తోపాటు ఏడాదిలో రూ.20 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. రెండు కార్డులపై కనీస మొత్తం లావాదేవీల పరిమితుల్లేవు. ప్రతి కొనుగోలుపైనా ఎడ్జ్ రివార్డు పాయింట్లు పొందొచ్చు. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ( Airport Lounge Access ) , ఫ్యూయల్ సర్‌చార్జీ మాఫీ ( Fuel Surcharge Waiver ), రెస్టారెంట్లలో డైనింగ్ ఆఫర్లు కూడా లభిస్తాయి. సిగ్నేచర్ ( Visa Signature ) క్రెడిట్ కార్డుపై ఏటా రూ.500, ఇనిఫినిటీ కార్డు ( Visa Infinite ) పై రూ.5000 వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.