న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రముఖ ఈవీల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను పరిచయం చేసింది. మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని విడుదల చేసిన సింపుల్ వేవ్ ప్రారంభ ధర రూ.1.09 లక్షలుగా నిర్ణయించింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈస్కూటర్ ఈ నెల చివరి నుంచి డెలివరీ చేయనున్నట్టు పేర్కొంది.
దీంట్లో 5కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 243 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. అలాగే 2.2 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 110 కిలోమీటర్లు, 2.7 కిలోవాట్ల బ్యాటరీ 132 కిలోమీటర్లు, 3.7 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 171 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నట్టు పేర్కొంది. రెండు గంటల్లో 80 శాతం వరకు బ్యాటరీ రీచార్జికానున్న ఈ స్కూటర్.. గంటకు 90 కిలోమీటర్ల వరకు వేగంతో దూసుకుపోనున్నది.