సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ) : వెయ్యిరోజుల కాంగ్రెస్ విఫల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ధోకేబాజ్ కాంగ్రెస్ వంచనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 1000 రోజులు పూర్తయినా ఏ ఒక హామీని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను దగా చేసిందని బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ మార్ 420 మోసాలు, అవినీతి, హామీల బకాయిలపై గులాబీ దళం కదనభేరి మోగించింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలులో దగా చేసిందంటూ.. బీఆర్ఎస్ నేతలు ప్రజలకు ‘బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. రైతు భరోసా, రూ. 500 కే గ్యాస్, రూ. 2,500 మహాలక్ష్మి భృతి, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి వంటి అనేక పథకాలను కాంగ్రెస్ సరార్ గాలికొదేసిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రధాన చౌరస్తాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్లకార్డులు చేతబూని కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘1000 రోజుల పాలనలో కాంగ్రెస్ సాధించింది శూన్యం, ప్రజాపాలన పేరుతో పీడిత పాలన కొనసాగిస్తూ ప్రజలను వంచిస్తున్న హస్తం ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలోనే తగిన బుద్ధి చెబుతాం’ అని హెచ్చరించారు.

గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో నిరసనలు భారీ ఎత్తున చేపట్టారు. 420 హామీలు ఇచ్చి అమలు చేయని సర్కార్ పై నిరసనగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని మానవ హారంగా ప్రదర్శించారు. పలు చోట్ల 420 అడుగుల పొడవైన బ్యానర్‌పై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనల వివరాలు, విదేశీ పర్యటనలకు సంబంధించిన అంశాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఎల్బీనగర్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో 420 ఫీట్ల బ్యానర్‌ను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులతో ఎల్బీనగర్లో జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఒక్కహామీ కూడా అమలు చేయలేదని ఎమ్మెల్యే ముఠాగోపాల్ మండిపడ్డారు.
ప్రజాపాలన అంటూనే ప్రజల నడ్డి విరుస్తున్నది.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్త్తామని రాష్టంలో ఉన్న అన్ని దేవాలయాల మీద ఒట్టు వేసి చెప్పిండు.. సీఎం రేవంత్‌రెడ్డి. తీరా చూస్తే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయచేతగాక తడబడుతున్నారు. పూటకోమాట.. రోజుకోతీరుగా వ్యవహరిస్తున్నారు సీఎం..మంత్రులు. నేటికి 1000 రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలు అమలు చేయడంలో విఫలమైంది. ఏ ఊరికెళ్లినా..ఏ వాడకెళ్లినా అది ప్రజా ప్రభుత్వం కాదు దోకా ప్రభుత్వం అని సబ్బండ వర్గాలు విమర్శిస్తున్నారు. 1000 రోజుల పరిపాలనలో చేతగాని హామీలు ఇచ్చి ఆ.. అంటే.. ఊ అంటే.. ఢిల్లీకి పోయే సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజల కష్టాలు ఏం తెలుసని విమర్శిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, సాధా రణ ప్రజలు రోడ్లపైకి వచ్చి సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)


కాంగ్రెస్ బాకీ కార్డుతో..ప్లకార్డు

పటాన్చెరులో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలు వివేకానంద్, సుధీర్‌రెడ్డి

నినాదాలతో హోరెతిస్తూ.. ర్యాలీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు

చిక్కడపల్లిలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు

నల్లకుంట ఫీవర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నిరసన దీక్షలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

హామీలపై నిలదీస్తున్న మాజీ కార్పొరేటర్ సామల హేమ

మల్కాజిగిరి ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పార్టీ నాయకులు

సీఎం విదేశీ టూర్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్న ప్రజలు

కంటోన్మెంట్ క్రిశాంక్, పార్టీ నేతులు

సికింద్రాబాద్ : పద్మారావుగౌడ్, మాజీ కార్పొరేటర్లు, తదితరులు

ధర్నాలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్, పార్టీ నాయకులు