న్యూయార్క్, జూలై 10 : కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ దిగ్గజం సామ్సంగ్..ఈ ఏడాది చివరినాటికి ట్రై-ఫోల్డ్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతున్నది. దేశీయ మార్కెట్లోకి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, ఫ్లిప్ 7 స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన అనంతరం కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మిన్సోయిక్ కాంగ్ మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలల్లో మూడు మడతలు కలిగిన స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
ప్రస్తు తం ఈ ఫోన్ అభివృద్ధి దశలో ఉన్నదని, న్యూఢిల్లీకి సమీపంలో ఉన్న ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పటికే చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హ్యువాయ్ ఇప్పటికే ట్రై-ఫోల్డ్ ఫోన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే.