 
                                                            ముంబై, అక్టోబర్ 30 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో గురువారం ఒక్కరోజే 47 పైసలు క్షీణించి 88.69 వద్ద నిలిచింది. దీంతో మళ్లీ ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపీ వాల్యూ సమీపించినైట్టెంది. గతకొద్ది రోజులుగా బలపడుతూపోయిన దేశీయ కరెన్సీని..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతలు, భారతీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు ప్రభావితం చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. ఉదయం 88.37 స్థాయికి పుంజుకున్న రూపాయి.. ఆ తర్వాత 88.74 స్థాయికి నష్టపోయింది.
 
                            