ముంబై, ఫిబ్రవరి 23: రూపాయి విలువ పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు పడిపోయి 82.91 వద్ద ముగిసింది.
ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో రూపాయి పడిపోవడానికి ప్రధాన కారణమని ఫారెక్స్ ట్రేడర్లు వెల్లడించారు. 82.87 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్చేంజ్ రేటు ఒక దశలో 82.84 గరిష్ఠ స్థాయికి చేరుకున్నది.