Rupee Vs US Dollar | భారత కరెన్సీ రూపాయి మరింత బక్క చిక్కింది. సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌పై మరింత పతనమైంది. అంతర్జాతీయ బలహీనతల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిళ్లతో డాలర్‌పై రూపాయి 20 పైసలు నష్టపోయి 78.13గా స్థిరపడింది. 78.20 వద్ద ట్రేడింగ్ మొదలైన ఫారెక్స్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 78.02 గరిష్ఠానికి దూసుకెళ్లి.. ఒకానొక దశలో 78.29 కనిష్టానికి పడిపోయింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి అమెరికా డాలర్‌పై రూపాయి 78.13 వద్ద స్థిర పడింది. రూపాయి-డాలర్ మారకం విలువలో ఇదే ఆల్ టైం కనిష్ఠం. శుక్రవారం ట్రేడింగ్‌లోనూ రూపాయి 19 పైసలు నష్టపోయి 77.93 వద్ద ముగిసింది. ఆసియా దేశాల కరెన్సీలు బలహీనపడటంతో విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకోవడం కూడా రూపాయి బక్క చిక్కడానికి కారణాలని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరు కరెన్సీలపై డాలర్ ఇండెక్స్ 0.55 శాతం పెరిగి 104.71 డాలర్లకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ ఫ్యూచర్ క్రూడాయిల్ ధర 1.58 శాతం తగ్గి బ్యారెల్‌పై రూ.120.08తో స్థిరపడింది.దేశీయ స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 1457 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 427.40 పాయింట్లు నష్టపోయాయి.