International business | నిస్తేజంలో దేశీయ విదేశీ వాణిజ్యం.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 2.5 శాతం డౌన్
విదేశాలతో భారత్ జరిపే వాణిజ్యంలో నిస్తేజం ఆవరించింది. ఈ ఏడాది తొలి ఆరు నెలలకుగాను (జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో) విదేశీ వాణిజ్యం 800 బిలియన్ డాలర్ల స్థాయిలో జరిగిందని ఓ సర్వే వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో జరిగిన వాణిజ్యంతో పోలిస్తే 2.5 శాతం తగ్గినట్లు తెలిపింది.
International business | న్యూఢిల్లీ, ఆగస్టు 21: విదేశాలతో భారత్ జరిపే వాణిజ్యంలో నిస్తేజం ఆవరించింది. ఈ ఏడాది తొలి ఆరు నెలలకుగాను (జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో) విదేశీ వాణిజ్యం 800 బిలియన్ డాలర్ల స్థాయిలో జరిగిందని ఓ సర్వే వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో జరిగిన వాణిజ్యంతో పోలిస్తే 2.5 శాతం తగ్గినట్లు తెలిపింది. అంతర్జాతయ దేశాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో భారత్ ఇతర దేశాలతో జరుపుతున్న వాణిజ్యం కూడా తగ్గిందని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇంటివేటివ్(జీటీఆర్ఐ) తాజాగా వెల్లడించింది. దీంట్లో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 1.5 శాతం పెరిగి 379.5 బిలియన్ డాలర్ల నుంచి 385.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దిగుమతులు 5.9 శాతం తగ్గి 441.7 బిలియన్ డాలర్ల నుంచి 415.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
రూపాయి-డాలర్ రూపంలో జరిగిన వాణిజ్యం 76.16 శాతం నుంచి 82.18 శాతానికి చేరుకున్నది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం, అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్యవిధానం, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల వల్లనే వాణిజ్యంలో ఆశించిన స్థాయిలో వృద్ధిని సాధించలేకపోయం.
– అజయ్ శ్రీవాత్సవ, జీటీఆర్ఐ కో-ఫౌండర్
- జనవరి-జూన్ మధ్యకాలంలో దేశీయ విదేశీ వాణిజ్యం 800.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది నమోదైనదాంతో పోలిస్తే 2.5 శాతం తగ్గింది.
- ఏకీకృత విషయానికి వస్తే వస్తువుల ఎగుమతులు 8.1 శాతం తగ్గి 218.7 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దిగుమతులు 8.3 శాతం తగ్గి 325.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
- సేవల ఎగుమతులు 17.7 శాతం పెరిగి 166.7 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 89.8 బిలియన్ డాలర్లు.
- దేశీయ మొత్తం ఎగుమతుల్లో 29 ఉత్పత్తుల్లో 11 ఉత్పత్తుల వాటా 25 శాతంగా ఉన్నది. వీటలో టెలికం, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, యంత్రాలు, బాయిలర్స్, టర్బైన్లు, ఫార్మాస్యూటికల్స్, సెరామిక్ ఉత్పత్తులు ఉన్నాయి.
- మొత్తం 29 ఉత్పత్తుల ఎగుమతుల్లో 18 ఉత్పత్తులు 75 శాతం వాటా కలిగివున్నా యి. వీటిలో కూరగాయాలు, పండ్లు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు, టెక్స్టైల్స్, పాదరక్షలు ఉన్నాయి.
- స్మార్ట్ఫోన్ ఎగుమతులు 7.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
- భారత్ 240 దేశాలకు ఎగుమతి చేస్తున్నది. అలాగే 134 దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది.
- చైనా, రష్యా, సౌదీ అరేబియా, ఇరాక్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య జరిగిన వాణిజ్యంలో వాణిజ్య లోటు అధికంగా ఉన్నది.
- చమురు దిగుమతులు 73.2 బిలియన్ డాలర్లకు తగ్గడం విశేషం. కానీ, రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 31.3 శాతానికి ఎగబాకాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

