Rupee | ముంబై, నవంబర్ 14: రూపాయి పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు నేలచూపు చూస్తున్నాయి. దీంట్లోభాగంగానే దేశీయ కరెన్సీ విలువ మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి మునుపెన్నడు కనిష్ఠ స్థాయి 84.46కి పడిపోయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటం, డాలర్‌కు డిమాండ్ ఉండటం వల్లనే రూపాయి విలువ మరింత పతనం చెందిందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు.