దుండిగల్, ఆగస్టు 8 : జీవిత కాలంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునేది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉండే కల. తమ కలలను కొందరు సాకారం చేసుకుంటే.. మరికొందరు కలల్లోనే జీవిస్తూ కాలం గడిపేస్తుంటారు. ఎందుకంటే ఆకాశాన్నంటే ధరలతో తాము సొంత ఇంటిని కొనగలమా…? అనే అనుమానాలు బలంగా వారిలో నాటుకుపోవడమే కారణం. ఈ క్రమంలో సామాన్యులకు సైతం అంత తక్కువ బడ్జెట్ల్లో ఇంటిని నిర్మించి అందజేసేందుకు ముందుకు వచ్చింది ‘రుబ్రిక్ శ్రీవెన్ త్రిపుర’నిర్మాణ సంస్థ. అది కూడా మహానగరానికి అతిచేరువులో ఉన్న గండిమైసమ్మ పరిసర ప్రాంతంలో రూ.5,400 లకే చదరపు అడుగు చొప్పున సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముందు కు వచ్చింది.
ఇండిపెండెంట్ వేడుకల సందర్భంగా ప్రతి ప్లాట్ కొనుగోలుపై మడ్యూలర్ కిచెన్‌ను ఉచితంగా అందజేయనున్నారు. సమీపంలోని బౌరంపేట్ నుండి దూలపల్లి వరకు అటవీ ప్రాంతం ఉండటం స్వచ్ఛమైన శ్వాసకోసం కలిసొచ్చే మరో అంశం. దీనికి తోడు గండిమైసమ్మ పరిసరాలు ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇండ్లు కొనుగోలు చేయాలనుకునే అందరిచూపు అటువైపే ఉంది. ఇక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్‌కు భరోసాగా నిలుస్తుందనడంలో సందేహం లేదంటున్నారు రియల్ నిపుణులు. ఈ క్రమంలో హైదరాబాద్ రియాల్టీలో కొత్త అవకాశం ఉన్న ప్రాంతంగా ఇక్కడ గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి.
గండిమైసమ్మ ప్రాంతంలో మొత్తం 5ఎకరాల 24 గుంటల సువిశాల విస్తీర్ణంలో మూడు టవర్లను నిర్మించేందుకు ముందుకు వస్తుంది ‘రుబ్రిక్ శ్రీవెన్ త్రిపుర’నిర్మాణ సంస్థ. ముందు గా 2025 ఏప్రిల్ నాటికి మొదటి టవర్ నిర్మాణ ం పూర్తి చేసి వినియోగదారులకు సకలవసతుల (క్లబ్‌హౌజ్)తో అందజేస్తామంటున్నారు నిర్మాణ దారులు. మిగతా రెండు టవర్లను 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అయితే ఇండిపెండెంట్ డే వేడుకల సందర్భంగా ప్రతి ఫ్లాట్ కొనుగోలుదారుకు మాడ్యూలర్ కిచెన్‌ను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.
మియాపూర్,బాచుపల్లి చుట్టుపక్కల ప్రాంతా ల్లో ఇప్పటికే నిర్మాణం రంగం విస్తరించాయి. ఇక్కడి ధరలతో పోలిస్తే అతితక్కువ ధరలకే గండిమైసమ్మ ప్రాంతంలో ఇండ్లు దొరుకుతుండటంతో ఇక్కడ ఇండ్లను కొనుగోలు చేయవచ్చుననేది ఆశావాహుల నమ్మకం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి, దుండిగల్ మున్సిపాలిటీ, డీ.పోచంపల్లిలోని ప్రాధాన ప్రాంతం గండిమైసమ్మ. కొంపల్లి కూడా బాగా అభివృద్ధి చెందడంతో అక్కడ బడ్జెట్‌ను మించి ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. దీంతో గండిమైసమ్మ పరిసర ప్రాంతంలో ఇండ్లను నిర్మించేందుకు బడా నిర్మాణ సంస్థలు తమ నిర్మాణాలను ఇక్కడ చేపట్టేందుకు ముందుకొ స్తున్నాయి. గండిమైసమ్మ చుట్టూ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, వైద్యశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత టెక్ మహేంద్ర విశ్వవిద్యాలయం, మల్లారెడ్డి విశ్వవిద్యాలయంతో పాటు వైద్య కళాశాల, మల్లారెడ్డి ఆసుపత్రి, నారాయణ హృదయాలయ, అరుంధతి ఆసుపత్రులు అతి సమీపంలోనే ఉన్నాయి.
గండిమైసమ్మ చుట్టుపక్కల బాసర్గడి, గౌడవెల్లి , అయోధ్య క్రాస్‌రోడ్స్, బహదూర్‌పల్లి, మైసమ్మగూడ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు రూ.5,400 లకు అటుఇటుగా చెబుతున్నారు. ప్రాజెక్టులు, వాటిల్లో కల్పించే సౌకర్యాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటున్నట్లు తెలుస్తుంది.