హైదరాబాద్, జూలై 2: ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్..ఆషాఢం కేజీ సేల్కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 3న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ల కింద 70 శాతం తగ్గింపు ధరతో కొనుగోలుదారులకు అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్‌ను కస్టమర్లు వినియోగించుకోవాలని సూచించింది.
శుభకార్యాలు, పర్వదినాలు, రాబోయే వేడుకలకు నాణ్యమైన వెరైటీలను లాభసాటిగా, సరిసాటిలేని ధరలతో సొంతం చేసుకోవచ్చునని పేర్కొంది. అన్ని వెరైటీలను ఒకేచోట లభించే విధంగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ పేరును సార్థకం చేసుకుంటూ ఆర్ఎస్ బ్రదర్స్ ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.