న్యూఢిల్లీ, మార్చి 12: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్కు రూ.74.22 కోట్ల ట్యాక్స్ నోటీసు అందింది. తప్పుగా ఫైల్ చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్టు ఆరోపిస్తూ పెనాల్టీతో కలిపి రూ. 74.22 కోట్లు కట్టాలంటూ హైదరాబాద్ జీఎస్టీ కమీషనరేట్ అదనపు కమీషనర్ ట్యాక్స్ నోటీసు జారీచేశారు. అందులో పన్ను మొత్తం రూ.67,47,37,495 కాగా, పెనాల్టీ రూ.6,74,73,752. ఈ నోటీసుపై అప్పిలేట్ అథారిటీలో అప్పీలు దాఖలు చేస్తామని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. తమ ఆర్థిక అంశాలు, కార్యకలాపాలపై ప్రభావం ఉండబోదన్న విశ్వాసాన్ని కంపెనీ వ్యక్తం చేసింది.