హైదరాబాద్: జనాలకు రుచికరమైన గరం చాయ్(Chai )తాగిపిస్తూ యువతకు కార్పొరేట్ స్థాయి ఉపాధి చూపిస్తున్నాడు సినీ నటుడు, వ్యాపారవేత్త, సామాజిక సేవకులు అభినవ్ సర్ధార్. తెలుగు రాష్ట్రాల్లో టీ బిజినెస్‌కు పర్ఫెక్ట్ కార్పొరేట్ బ్రాండ్‌గా తీర్చిదిద్దిన ‘హైదరాబాదీ చాయ్ అడ్డా’ (Hyderabadi Chai Adda) సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తాజాగా తన నూతన ప్రీమియం ఫ్రాంచైజీని హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీపట్నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..ఈ తరం యువత ఉద్యోగాలు సైతం వదిలి టీ వ్యాపారంలో దూసుకుపోయేందుకు సరదా పడుతున్నారు. యువతకు కార్పొరేట్ స్థాయి వ్యాపారం చూపించేలా నటుడు అభినవ్ సర్ధార్ ‘చాయ్’కు కొత్త నిర్వచనాన్ని చెబుతూ హైదరాబాదీ చాయ్ అడ్డా సంస్థను ప్రారంభించారన్నారు. ప్రీమియం ఫ్రాంచైజీలను దేశవ్యాప్తంగా అందిస్తూ యువతకు చక్కని ఉపాధి చూపిస్తున్నారు. జీవితంలో ఎదగాలనుకునే వారికి ఇది చక్కని వ్యాపార అవకాశమని పేర్కొన్నారు.
హైదరాబాదీ చాయ్ అడ్డా సంస్థ నిర్వాహకుడు అభినవ్ సర్ధార్ మాట్లాడుతూ.. దేశంలోని యువతకు కార్పొరేటట్ స్థాయిలో ఉపాధి అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా 2016లో హైదరాబాదీ చాయ్ అడ్డా(HCA)ను ప్రారంభించామన్నారు. ప్రతి చాయ్ కప్పులో సంప్రదాయాన్ని, ఆధునికతను మేళవించిన.. చాయ్‌ను కేవలం పానీయం కాకుండా ఒక భావోద్వేగ అనుభవంగా మార్చే లక్ష్యంతో ప్రారంభమైన హెచ్‌సీఏ, ఇప్పుడు ఒక సాంస్కృతిక ఉద్యమంగా మారింది తెలిపారు.
ఇప్పటికే ఫ్రాంచైజీలు తీసుకున్న వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కాన్సెప్ట్ చాలా మందికి నచ్చడంతో ఫ్రాంచైజీలను తీసుకుని స్టోర్స్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇందుకోసం ఫ్రాంచైజీ మోడళ్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని తెలిపారు. అభిరుచి కలిగిన వ్యాపారవేత్తలు ఈ బిజినెస్ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు.